
'దేవకీ నందన వాసుదేవ' నుంచి సాంగ్ రిలీజ్
11 months ago | 0 Views
టాలీవుడ్ యాక్టర్ అశోక్ గల్లా కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా 'దేవకీ నందన వాసుదేవ'. 'గుణ 369' ఫేం అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నాడు. 2 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీ నుంచి ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం సెకండ్ సింగిల్ జై బోలో కృష్ణ సాంగ్ లాంఛ్ చేశారు. రఘురామ్ రాసిన ఈ పాటను బీమ్స్ సిసిరోలియో కంపోజిషన్‌లో స్వరాగ్ కీర్తన్ పాడాడు. ఈ మూవీకి 'జాంబిరెడ్డి' ఫేం ప్రశాంత్ వర్మ కథనందిస్తున్నాడు.
మేకర్స్ ఫస్ట్ యాక్షన్ వీడియోలో.. బురదలో జరిగే ఫైట్ సన్నివేశంతో కట్ చేసిన ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథాంశంతో తెరకెక్కుతన్న ఈ సినిమాలో అశోక్ గల్లా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు డైరెక్టర్ టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మూవీని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. నీ బిడ్డకు మరణగండం.. లేదా అతని చేతిలో మరొకరికి మరణం అనే డైలాగ్స్‌తో సాగే టీజర్ సినిమాపై ఇప్పటికే క్యూరియాసిటీ పెంచుతోంది.