
మతాంతర వివాహంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా: నటి ప్రియమణి మనోగతం
6 months ago | 1 Views
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియమణి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ముస్తాఫారాజ్‌తో వివాహం తర్వాత తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ముస్తాఫా రాజ్ నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. మా అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు కలవడంతో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాం. 2016లో నిశ్చితార్థమైన నాటినుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నా. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తప్పుబడుతూ పలువురు నన్ను ట్రోల్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. కొన్ని సందర్భాల్లో నేను వాటికి ప్రాధాన్యం ఇవ్వను. అయినప్పటికీ వారి మాటలు నన్నెంతో బాధించాయి.
కులమతాలకతీతంగా పెళ్లి చేసుకున్న స్టార్లు ఎంతోమంది పరిశ్రమలో ఉన్నారు. కానీ, ఈ విషయంలో నన్నే ఎక్కువగా విమర్శించారు. ప్రేమ రెండు మనసులకు సంబంధించిన విషయం. ఆర్థికస్థిరత్వం, ప్రాంతం, భాష.. ఇలాంటి వ్యత్యాసాలు ప్రేమకు ఉండవని ప్రియమణి చెప్పారు. 'జవాన్’తో గతేడాది ప్రేక్షకులను అలరించారు ప్రియమణి. ఈ ఏడాది ఆమె నటించిన మూడు ప్రాజెక్ట్‌లు విడులయ్యాయి. 'మైదాన్’, ’ఆర్టికల్ 370’ మిశ్రమ స్పందనలకు పరిమితమయ్యాయి. 'భామాకలాపం 2’తో పాజిటివ్ టాక్ అందుకున్నారు. 2022లో విడుదలైన 'భామాకలాపం’కు కొనసాగింపుగా ఇది వచ్చింది. ప్రస్తుతం ఆమె కన్నడ, మలయాళంలో సినిమాలు చేస్తున్నారు.
ఇంకా చదవండి: తెలుగు సినిమా అంతా నా వెనక నిలబడింది : నాగ్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !